తెలుగు చలన చిత్ర చరిత్రలో పరుచూరి బ్రదర్స్ ది ఓ ప్రత్యేక అధ్యాయం. రచయితలుగా, దర్శకులుగా, నటులుగా పరుచూరి వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారు. పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు కూడా ఇప్పుడు వీరి బాటలోనే నడుస్తున్నాడు. వెంకటేశ్వరరావు తనయుడు రవీంద్రనాథ్ కొడుకైన సుదర్శన్ హీరోగా శనివారం ‘సిద్ధాపూర్ అగ్రహారం’ సినిమా మొదలైంది. వాసు తిరుమల, ఉష శివకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాకేష్ శ్రీపాద దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకులు బి. గోపాల్…