తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన నటుడు నరేష్. ‘ప్రేమ సంకెళ్ళు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన, ‘నాలుగు స్తంభాలాట’ వంటి విజయాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కామెడీ ప్రధానంగా తెరకెక్కిన సినిమాల్లో ఎక్కువగా నటించిన నరేష్, తన హాస్య టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఆయన నటన కేవలం కామెడీ రోల్స్‌కే పరిమితం కాలేదు. సెంటిమెంట్, ఎమోషనల్, యాక్షన్ సినిమాల్లో కూడా రాణించి ఆల్‌రౌండర్‌గా పేరు సంపాదించారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ధూసుకుపొతున్నారు.…