Off The Record: ఏలూరు జిల్లాలో టిడిపి కంచుకోట పాలకొల్లును బద్దలు కొట్టడమే లక్ష్యంగా వైసిపి పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ కంచుకోటగా పాలకొల్లు నియోజకవర్గం…పార్టీ ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే…1989, 2009లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. మరే పార్టీకి టిడిపిని ఓడించడం సాధ్యం కాలేదు. అందుకే వచ్చే ఎన్నికల్లో అయినా పాలకొల్లులో పాగా వేయాలనే టార్గెట్‌తో పని చేస్తోంది వైసీపీ. అలాంటి చోట వైసిపి గెలిస్తే…ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాపై పట్టు సాధించవచ్చని అంచనా…