లోయలో పడిన ఆర్మీ వాహనం.. ముగ్గురు సైనికులు మృతి జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది. 700 అడుగుల లోతైన లోయలో ఆర్మీ కాన్వాయ్ లోని వాహనం పడింది. జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు సైనికులు మృతిచెందారు. మరణించిన సైనికులను అమిత్ కుమార్, సుజీత్ కుమార్, మాన్ బహదూర్ గా గుర్తించినట్లు వార్తా సంస్థ పిటిఐ తెలిపింది. 700…