పాకిస్థాన్‌లో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్-ఎన్, బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ, ఇమ్రాన్‌ఖాన్ పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్‌ల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. అవినీతి కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉండటం.. పీటీఐ పార్టీ బ్యాట్ గుర్తుపై ఈసీ నిషేధం విధించడంతో షరీఫ్‌కు చెందిన పీఎంఎల్ (ఎన్).. ఈ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది.
ఉగ్రదాడి సూత్రధారి, ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ పాకిస్థాన్ మర్కాజీ ముస్లిం లీగ్ (పీఎంఎంఎల్) పాకిస్థాన్‌లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తుందని పాక్ ఆంగ్ల దినపత్రిక డాన్ నివేదిక పేర్కొంది. ఫిబ్రవరి 8న జరగనున్న ఎన్నికల్లో పాకిస్థాన్‌లోని ప్రతి జాతీయ, ప్రావిన్సు అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ అభ్యర్థులను నిలబెట్టినట్లు సమాచారం.