Pakistan: పాకిస్థాన్ ప్రస్తుతం తన చరిత్రలోనే అతిపెద్ద ప్రతిభా వలస (టాలెంట్ ఎగ్జోడస్)ను ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. తీవ్రమవుతున్న ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత కారణంగా కేవలం రెండేళ్లలోనే వేల సంఖ్యలో డాక్టర్లు, ఇంజినీర్లు, అకౌంటెంట్లు దేశాన్ని విడిచిపెడుతున్నారు. ఇటీవల విడుదలైన ప్రభుత్వ నివేదిక ఈ నిజాన్ని బయటపెట్టింది. గత 24 నెలల్లో పాకిస్థాన్ నుంచి 5,000 మంది డాక్టర్లు, 11,000 మంది ఇంజినీర్లు, 13,000 మంది అకౌంటెంట్లు విదేశాలకు వెళ్లిపోయినట్లు ఆ నివేదిక చెబుతోంది.