పద్మభూషణ్ అవార్డు అందుకున్న అనంతరం చినజీయర్ స్వామి స్పందించారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వాలంటీర్లకు లభించిన సత్కారమే అని అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల రెండో విడత కార్యక్రమం బుధవారం జరిగింది.