ఆవును హిందూ మతంలో మాతగా పరిగణిస్తారు. పవిత్రమైన విలువను కలిగి ఉంది. దీనిపై మరింత అవగాహన కల్పించేందుకు ఉత్తరత్త ప్రదేశ్‌లోని లక్నోలో ఓ ఆవు చేత రెస్టారెంట్‌ను ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. పవిత్ర జంతువు అయిన గోమాత వస్త్రాలతో అలంకరించబడి, పసుపు వస్త్రంతో కప్పబడి, సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులతో తయారు చేసిన ఆహారాన్ని అందించే 'ఆర్గానిక్ ఒయాసిస్' అనే రెస్టారెంట్‌ను ప్రారంభించింది.