కోల్‌కతా హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. దీనిపై ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. డాక్టర్ల భద్రతపై చర్యలు తీసుకోవాలని వైద్యులు, నర్సులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. నిరసనల నేపథ్యంలో తాజాగా కేరళ ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కాలేజీల్లో స్పేస్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించింది.