Special Story on ONDC: ఓఎన్‌డీసీ అంటే.. ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఇది ఇ-కామర్స్ కోసం ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫాం. ఇ-కామర్స్‌కి సంబంధించి యూపీఐ లాంటిది. ఆన్‌లైన్ పేమెంట్స్‌లో యూపీఐ ఒక విప్లవం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇలాగే డిజిటల్ కామర్స్‌లో కూడా ఓఎన్‌డీసీ ఒక రెవల్యూషన్ తీసుకొస్తుందనే అంచనాతో మొదలైంది. వినియోగదారుల వైపు నుంచి ఆలోచిస్తే ఇదొక ఈజీ యాక్సెస్ ట్రేడింగ్ యాప్ సిస్టమ్.