Work From Home: ఐటీ రంగంలో అగ్రగామి సంస్థలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మరియు ఇన్ఫోసిస్ కొత్త సంవత్సరంలో తమ ఉద్యోగులకు సరికొత్త ఆఫర్ ప్రకటించాయి. అయితే.. ఆ ఆఫర్.. ఇన్ఫోసిస్ ఉద్యోగులకు ఆమోదయోగ్యం అనిపిస్తుండగా టీసీఎస్ ఉద్యోగులకు మాత్రం హార్డ్‌గా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగులు వర్క్ ఫ్రం ఆఫీస్ చేయాల్సిందేనని టీసీఎస్ కంపెనీ తేల్చిచెబుతుండగా.. వర్క్ ఫ్రం హోం అయినా పర్లేదంటూ ఇన్ఫోసిస్ అనుమతిస్తోంది.