జీవీఎల్ నరసింహారావు. ఉత్తర ప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు. 2024 నాటికి ఆయన పదవీ కాలం ముగియనుండగ ఈసారి ప్రత్యక్ష ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. బీజేపీకి గౌరవ ప్రదమైన ఓట్ బ్యాంక్., గతంలో గెలిచిన చరిత్ర ఉన్న విశాఖపట్టణం మీద కర్చీఫ్ వేశారు. వలస నేతలను ఆదరించే అర్బన్ ఓటర్లను ఆకర్షించడం ద్వారా ప్రజాక్షేత్రంలో గెలవాలనేది జీవీఎల్ ఆలోచన అట. అందుకే కొద్దికాలంగా ఢిల్లీ టు వైజాగ్ షెటిల్ సర్వీస్ చేస్తున్న ఆయన..…