ఒడిశా చలనచిత్ర పరిశ్రమకు ఇది అత్యంత విషాదకర సమయం. ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ హ్యూమన్ సాగర్ కేవలం 34 సంవత్సరాల చిన్న వయసులోనే కన్నుమూశారు. ఆయన అకాల మరణం ఒడియా చిత్ర పరిశ్రమను (ఆలీవుడ్) మరియు సంగీతాభిమానులను తీవ్ర శోకంలో ముంచెత్తింది. హ్యూమన్ ఇక లేరనే వార్తను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న హ్యూమన్ సాగర్, నవంబర్ 14న భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో ఆయనను ఐసియుకి తరలించారు.…