Tata Sierra EV: 665KM రేంజ్‌తో టాటా సియెర్రా EV లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
- భారత్‌లోకి టాటా సియెర్రా EV
- 665KM రేంజ్
- ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.18.79 లక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న టాటా సియెర్రా EVని అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆధునిక ఫీచర్లు, పవర్ ఫుల్ బ్యాటరీ, ఆకర్షణీయమైన డిజైన్‌తో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ SUV మధ్యతరహా ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్లో కొత్త పోటీని సృష్టించనుంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 665 కిలోమీటర్ల (MIDC) వరకు రేంజ్ అందించడం దీని ప్రధాన ఆకర్షణ.
ఆకట్టుకునే డిజైన్, ప్రీమియం ఫీచర్లు
టాటా సియెర్రా EVలో ఆధునిక టెక్నాలజీతో కూడిన పలు ప్రీమియం ఫీచర్లను అందించారు. ఇందులో LED హెడ్లైట్లు, LED DRLs, LED టెయిల్ లైట్లు, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, పనోరమిక్ సన్‌రూఫ్, ట్రిపుల్ డిస్ప్లే స్క్రీన్, హెడ్-అప్ డిస్ప్లే (HUD), వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, వైర్లెస్ ఛార్జర్, JBL ఆడియో సిస్టమ్, డాల్బీ అట్మోస్, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం లెవెల్-2 ADAS, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, రియర్ పార్కింగ్ సెన్సర్లు, రియర్ వ్యూ కెమెరా, 540-డిగ్రీల కెమెరా వంటి ఆధునిక సేఫ్టీ ఫీచర్లను కూడా అందించారు.
Also Read
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
- Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
- Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
665 కి.మీ రేంజ్
టాటా సియెర్రా EVను 63 kWh, 75 kWh బ్యాటరీ ప్యాక్‌లతో అందుబాటులోకి తీసుకొచ్చారు. పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో ఈ SUV 665 కిలోమీటర్ల (MIDC) వరకు డ్రైవింగ్ రేంజ్ అందిస్తుంది. ఈ SUVలో డ్యూయల్ మోటార్, ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సెటప్ ఉంది. ముందు మోటార్ 175 kW పవర్, 340 Nm టార్క్, వెనుక మోటార్ 103 kW పవర్, 164 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కేవలం 5.8 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గంట వేగాన్ని అందుకోగలదు.
బూట్ స్పేస్ కూడా భారీగా
ప్రయాణాలకు అనుకూలంగా 622 లీటర్ల బూట్ స్పేస్ తో పాటు ముందు భాగంలో 55 లీటర్ల ఫ్రంక్ (Frunk) స్టోరేజ్‌ను కూడా టాటా అందించింది.
ధర, బుకింగ్స్ వివరాలు
టాటా మోటార్స్ సియెర్రా EV ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ.18.79 లక్షలుగా నిర్ణయించింది. వాహనం కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి, కాగా డెలివరీలు జూలై 15 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఎవరితో పోటీ?
భారత మార్కెట్లో టాటా సియెర్రా EV నేరుగా MG Windsor EV, Hyundai Creta Electric, Kia Carens Clavis EV, Mahindra XEV 9e వంటి ఎలక్ట్రిక్ SUVలతో పోటీపడనుంది.
- Tags
- Tata
- Tata Sierra EV
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!