మణిపూర్ నోనీ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం రాత్రి నోని జిల్లాలోని టెరిటోరియల్ ఆర్మీ క్యాంప్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో జవాన్లతో పాటు ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. శనివారానికి మరణించిన వారి సంఖ్య 20కి చేరింది. మృతుల్లో 15 మంది జవాన్లు ఉన్నారు. ఇప్పటి వరకు ఆర్మీకి చెందిన 13 మంది సిబ్బందిని ఐదుగురు ప్రజలను రెస్క్యూ చేశారు. మరో 44 మంది కనిపించకుండా పోయారు. వీరంతా…