స్కూలు పిల్లల పుస్తకాల భారాన్ని తగ్గించేందుకు తెలంగాణలో ‘నో బ్యాగ్ డే’ అనే కొత్త కార్యక్రమం ప్రవేశపెట్టబడింది. పాఠశాలలను విద్యార్థులకు మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో ప్రతినెలా నాలుగో శనివారం ‘నో బ్యాగ్ డే’ను అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.