పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలిలో గోదావరి ఏటిగట్టు పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. "జగన్ ఐదేళ్ల పాలనలో ఇరిగేషన్ శాఖను విధ్వంసం చేసి, కనీస మెయింటెన్స్ పనులు కూడా పట్టించుకోకపోవడంతో ఏటిగట్లు బలహీనపడి ప్రమాదంగా మారాయి. రాష్ట్రంలో ఇరిగేషన్ అత్యవసర పనులు నిమిత్తం చంద్రబాబు మంజూరు చేసిన రూ. 320 కోట్ల నిధుల పనులను మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలి. జగన్ పాలనలో గోదావరి ఏటిగట్లకు ఒక్క రూపాయి…