భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించే టీ20 వరల్డ్ కప్ 2026 కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ‘ఎక్స్’ వేదికగా ఈరోజు ఉదయం వెల్లడించింది. స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ కివీస్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఉపఖండ పిచ్‌లు కాబట్టి నలుగురు స్పిన్నర్లను రంగంలోకి దించుతోంది. ఇక బ్లాక్ క్యాప్స్ జట్టులో 31 ఏళ్ల జాకబ్ డఫీ మాత్రమే కొత్త ఆటగాడు. ప్రపంచకప్ కోసం సన్నాహకంగా జనవరి చివరి…