చిత్ర పరిశ్రమలో నటీనటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులలాగే ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్ ను ప్రారంభించి తరువాత ఇండస్ట్రీలో హీరోలుగా, హీరోయిన్లుగా నిలదొక్కుకున్న స్టార్స్ చాలామందే ఉన్నారు. అయితే కొన్నిసార్లు సినిమాలు లేదా సీరియల్స్ చేయడం వల్ల చైల్డ్ ఆర్టిస్టుల చదువుకు ఆటంకం కలుగుతుంది. పైగా వారికి ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వారి సమస్యలపై దృష్టి పెట్టిన తెలంగాణ కార్మిక శాఖ తాజాగా సినిమా పరిశ్రమకు కొన్ని నిబంధనలు…