ఎయిర్ స్టాఫ్ చీఫ్‌గా అమర్ ప్రీత్ సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తర్వాత భారత వైమానిక దళానికి చీఫ్‌గా అమర్ ప్రీత్ సింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అమర్ ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 30 మధ్యాహ్నం నుంచి నియామకం అమలులోకి వస్తోందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.