ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ ఓ నాయిబ్రాహ్మణుడికి అన్యాయం చేశారంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో నేడు తిరుపతిలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిబ్రాహ్మణ సంఘం నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మీడియాలో వస్తున్న నాయి బ్రాహ్మణుడికి మంచు మోహన్ బాబు ఫ్యామిలీ అన్యాయం చేసిందని వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని వారు క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా నాగ శీనుపై కేసు పెట్టింది మోహన్ బాబు…