Khushbu Sundar: ప్రముఖ నటి, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కీలక నేత ఖుష్బూ సుందర్ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి పదవికి రాజీనామా చేశారు. జూన్ 28 నుంచి అమలులోకి వచ్చే ఆమె రాజీనామాను ఆమోదించినట్లు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చేందుకే ఆమె రాజీనామా చేసినట్లు వెల్లడించింది.