ప్రపంచమంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న సుధీర్ఘ విరామానికి తెరపడింది. భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చింది. బుచ్ విల్మోర్ కూడా ఆమెతో తిరిగి వచ్చాడు. బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు క్యాప్సూల్స్ ఫ్లోరిడా తీరంలో విజయవంతంగా ల్యాండింగ్ అయ్యింది. ఇద్దరు వ్యోమగాములతో స్పేస్‌ఎక్స్ క్రూ-9 భూమికి తిరిగి వచ్చింది. అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తిరిగి రావడానికి 17 గంటలు పట్టింది. క్యాప్సుల్స్ సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది. నాసా సిబ్బంది…