తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్‌ను నల్లగొండ జిల్లాలోని గాంధీ గుడి కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా గవర్నర్ రాధాకృష్ణన్ ను గాంధీ గుడి సభ్యులు శాలువాతో సత్కరించారు. తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు తీసుకున్న చర్యలను గవర్నర్‌కు గాంధీ గుడి సభ్యులు వివరించారు. అంతేకాకుండా.. మద్యపాన నిషేధ ప్రచారాన్ని చేయాలని గాంధీ గుడి సభ్యులకు గవర్నర్ సూచించారు. డబ్బు పంపిణీకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే తాను ఓ ఎన్నికల్లో ఓడిపోయానని…