Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున.. నా సామి రంగ సినిమాతో అభిమానుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ నే అందుకుంది. విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలుగా నటించగా.. ఆషికా రంగనాధ్ హీరోయిన్ గా నటించింది.