ప్రముఖ కథానాయిక హన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం’మై నేమ్ ఈజ్ శ్రుతి’. ది హిడెన్ ట్రూత్ అనేది ఉపశీర్షిక. రమ్య బురుగు, నాగేందర్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి. శ్రీనివాస్ ఓంకార్ దర్శకుడు. ఇటీవల చిత్రీకరణ ప్రారంభమైన ఈ చిత్రం తొలిషెడ్యూల్‌ని పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ‘బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్‌ప్లేతో రూపుదిద్దుకుంటున్న సినిమా ఇది. ఇలాంటి పాత్రను హన్సిక ఇప్పటి వరకు తన కెరియర్‌లో పోషించలేదు. ఈ…