ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నదుల్లో మూసీ ఒకటి. ఇప్పుడు దీన్ని పూర్తిగా మార్చేయాలనుకుంటోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆక్రమణలతో అన్యాక్రాంతమైపోయిన ఈ నదికి పునరుజ్జీవం కల్పించాలనుకుంటోంది. లండన్ లోని థేమ్స్ నది, సియోల్ లోని చియోంగ్ జియోన్ నది లాగా దీన్ని సుందరీకరించాలనుకుంటోంది. మరి దీనిపై వివాదం ఎందుకు..? మూసీ నది చరిత్రేంటి..? ఎందుకిలా తయారైంది..? తెలంగాణలో మూసీ నదికి ఘన చరిత్ర ఉంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ నది పేరు కూడా ఎత్తలేని…