Karnataka: కర్ణాటకలోని యెల్లాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. తన పెళ్లి ప్రపోజల్ తిరస్కరించిందనే కోపంతో 30 ఏళ్ల వివాహితను ఒక వ్యక్తి హత్య చేశాడు. మృతురాలు నిందితుడికి చిన్ననాటి స్నేహితురాలు. నిందితుడిని రఫీక్ ఇమాంసాబాగా గుర్తించారు. ఈ సంఘటన తర్వాత రఫీక్ అడవిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. నలుగురు పిల్లలను దారుణంగా చంపిన తర్వాత తండ్రి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల కారణంగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్ బృందంతో సహా భారీ పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. తండ్రి తన నలుగురు అమాయక పిల్లల గొంతు కోసి చంపి.. ఆ తర్వాత అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.