26/11 Mumbai Attack: 26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి, లష్కరే తోయిబా(LeT) ఉగ్రసంస్థ టెర్రిరిస్ట్ ఆజం చీమా(70) పాకిస్తాన్‌లో మరణించినట్లు తెలుస్తోంది. 2008లో ముంబైపై ఉగ్రదాడిలో ఇతను కీలకంగా వ్యవహిరంచాడు. 70 ఏళ్ల వయసులో పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌లో గుండె పోటుతో మరనించాడు. లష్కరే తోయిబా సీనియర్ కమాండర్‌గా ఉన్న చీమా 26/11 ముంబై ఎటాక్స్, జూలై 2006లో ముంబైలో జరిగిన రైలు బాంబు పేలుళ్లలో కీలక నిందితుడు.