ఆప్ఘనిస్థాన్‌ను పూర్తిస్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకున్నామని ప్రకటించిన తాలిబన్లు.. ఇక, ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టిపెట్టారు.. ఆ దేశ రాజధాని కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచే ఈ చర్చ సాగుతోంది.. తాజాగా.. తాలిబన్లకు కొరకరాని కొయ్యగా ఉన్న పంజ్‌షీర్‌ను సైతం తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్టు ప్రకటించారు. ఇక, తాలిబాన్ల ప్రభుత్వ అధినేతగా ముల్లా మహమ్మద్ హసన్ అఖుంద్ పేరు ఖరారైనట్టు పాకిస్థాన్ మీడియా పేర్కొంటోంది… తాలిబాన్ల అత్యున్నత నిర్ణయక మండలి అయిన ‘రెహబరీ షురా’ దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు…