జూన్ రెండవ వారం నడుస్తోంది. అయినా చినుకు జాడలేదు. ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రుతుపవనాలు కేరళను తాకేశాయని, మనకు ఈసారి ముందే వానలు పలకరిస్తాయన్న వాతావరణ శాఖ అంచనాలు తప్పాయా? అంటే అవుననే అనిపిస్తోంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా అయిదారు డిగ్రీలు అదనంగా పెరగాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నైరుతి రుతపవనాల రాకలో జాప్యం కారణంగా జూన్ రెండోవారంలోనూ ఇదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణశాఖ అధికారులు అంటున్నారు. మే 29న కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు తెలంగాణలోకి…