MRI Machine: అమెరికాలో ఓ అసాధారణ ఘటన చోటు చేసుకుంది. జూన్ నెలలో ఒక మహిళ MRI (మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజినింగ్) మెషీన్‌లోకి లోడ్ చేసిన తుపాకీతో వెళ్లింది. ఈ పరిణామం ఆమె ప్రాణాలను మీదికి తెచ్చింది. లోడ్ చేయబడిన తుపాకీ పేలడంతో ఆమె వెనక భాగంలో గాయమైంది. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం..57 ఏళ్ల మహిళ ఈ ప్రమాదానికి గురైనట్లు వెల్లడించింది.