జబర్దస్త్ ద్వారా ఊహించని క్రేజ్ సంపాదించి, ప్రస్తుతం వెండితెరపై నటుడిగా రాణిస్తున్న గెటప్ శ్రీను, సోషల్ మీడియా వేదికగా సినిమా రివ్యూయర్ల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవల కాలంలో రివ్యూల పేరుతో జరుగుతున్న వ్యక్తిగత విమర్శలు, హేళనలపై ఆయన తన ఫేస్‌బుక్ ఖాతాలో సుదీర్ఘమైన పోస్ట్ షేర్ చేస్తూ.. భవిష్యత్తులో రివ్యూలు ఎంత విడ్డూరంగా మారబోతున్నాయో ఉదాహరణలతో వివరించారు. సినిమా రివ్యూలు అనేవి ఒక కళాఖండాన్ని గౌరవించేలా ఉండాలి తప్ప, కించపరిచేలా…