మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో లుకలుకలు బయటపడ్డాయి. ఈ సారి ఏకంగా కొట్టుకోవడం, కేసులు పెట్టుకోవడం వరకు వెళ్ళింది. మోహన్ బాబు తనపై, తన భార్యపై మనుషులతో దాడి చేపించాడని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు మంచు మనోజ్. మోహన్ బాబు అనుచరులు దాడిలో గాయపడిన మనోజ్ నడవలేని స్థితిలో నిన్న ఓ ఆసుపత్రిలో చేరాడు. మంచు మనోజ్‌పై ఇంటర్నల్‌గా కాలు, మెడ భాగంలో దెబ్బలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. Also Read…