MotoGP: మోటార్ సైకిల్ రోడ్ రేసింగ్ ఈవెంట్లకు ప్రసిద్ధి చెందిన MotoGP భారత మ్యాపును తప్పగా చూపింది. ఉత్తర్ ప్రదేశ్ గ్రేటర్ నోయిడా బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో జరుగుతున్న ఇండియన్ ఆయిల్ గ్రాండ్ ఫ్రీక్స్ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారంలో భారత మ్యాపును తప్పుగా చూపింది. దీంతో MotoGP చేసిన తప్పును నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఎత్తి చూపారు. దీనిపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.