BJP MP Konda Vishweshwar Reddy: లోక్‌సభ జీరో హవర్‌లో బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి కోతుల సమస్యలను లేవనెత్తారు. కోతుల సమస్యతో రైతులు తీవ్రంగా పంట నష్టపోతున్నారని తెలిపారు.. కోతుల సమస్యను నివారించేందుకు జాతీయ స్థాయిలో కార్యక్రమం చేపట్టాలని కోరారు. కోతుల సమస్య తమ శాఖ కిందికి రాదని ప్రభుత్వ శాఖలు తప్పించుకుంటున్నాయని.. కోతుల సమస్య ఏ శాఖ కిందికి వస్తుందో వెల్లడించాలని ప్రశ్నించారు. ఈ అంశంపై కేంద్ర నుంచి సమాధానం రావాల్సి ఉంది..