జనసత్తా దళ్ (లోక్తాంత్రిక్) అధ్యక్షుడు, కుంట ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ తండ్రి ఉదయ్ ప్రతాప్ సింగ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నగరంలో శాంతియుతంగా ముహర్రం నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం గృహనిర్బంధంలో ఉంచినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ప్రతి సంవత్సరం మొహర్రం సందర్భంగా వ్యతిరేకతతో ప్రతాప్ సింగ్ ను గృహనిర్బంధంలో ఉంచుతారు. ఈసారి కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
సుధారాణి ఈ పేరు హైదరాబాద్ అందులో ముఖ్యంగా పాత బస్తీవాసులకు చాలా సుపరిచితం. బోనాలు, మొహరం పండుగ వస్తే సుధారాణి స్పెషల్ అందులో కనపడుతుంది. సుధారాణి అంటే ఎవరో కాదు బోనాల పండుగ దినం అమ్మవారి ఊరేగింపు, మొహర్రం రోజు బిబికా ఆలం ఊరేగింపు కోసం ఉపయోగించే అంబారి ఏనుగు. హైదరాబాద్ వాసులకు ఎంతగానో సేవలందించిన ఈ సుధారాణి అనే ఏనుగు బెల్గాం జిల్లా కర్ణాటక రాష్ట్రంలో ఈరోజు ఉదయం మరణించింది. గత రెండు సంవత్సరాలుగా అనారోగ్యంతో…