Off The Record: మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తాజాగా తెరపైకి తెచ్చిన డిమాండ్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. ప్రతి నియోజకవర్గానికి అభివృద్ధి కోసం యేడాదికి 25 కోట్లు ఇవ్వాలని ఆయన స్వరం పెంచడం ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో పాలమూరు ఎమ్మెల్యేది స్వపక్షమా? లేక విపక్షమా? అన్న డౌట్స్ సైతం వస్తున్నాయట కొందరికి. గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం ఎమ్మెల్యేల చేతిలో చిల్లి గవ్వ లేకపోవడం ఇబ్బందిగా మారిందని, పెళ్ళిళ్ళకో, పరామర్శలకో…