మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి సొంత గన్‌మ్యాన్ బుల్లెట్ యూరియా రూపంలో గట్టిగానే దిగిందట. గన్‌మ్యాన్ నాగు నాయక్ యూరియా లోడ్‌ను పక్కాదారి పట్టించిన వ్యవహారం... తిరిగి తిరిగి ఎమ్మెల్యేకు మెడకు చుట్టుకున్నట్టు తెలుస్తోంది. అది ప్రతిపక్ష పార్టీలకు అస్త్రంగా మారడంతో...బీఎల్‌ఆర్ మీద అధికార పార్టీ కీలక నేతలు బాగా సీరియస్ అయినట్టు సమాచారం. ఆ డ్యామేజ్ ను కంట్రోల్ చేసి.... తన ఇమేజ్‌ని కాపాడుకోవడానికి ఎమ్మెల్యే బత్తుల ఇప్పుడు నానా తంటాలు పడుతున్నారట. చిన్న నిర్లక్ష్యానికి..…
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి దూకుడు, ఆయన వ్యవహార శైలి ఏకంగా సొంత హస్తం పార్టీ క్యాడర్‌నే కలవర పెడుతోందట. అంతా నా ఇష్టం.. నా మాటే శాసనం అన్నట్టుగా ఆయన పోకడ ఉందని అంటున్నారు. నేను చెప్పినట్టే అంతా నడవాలి.. నా మాటే వినాలి.. అన్నీ నేనే అన్ని సెట్ చేస్తానంటూ..