తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య వివాదం ముదిరింది. గవర్నర్ ఆర్‌ఎన్ రవి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. గవర్నర్ ఆర్‌ఎన్ రవిపై ఫిర్యాదు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లేఖ రాశారని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.