నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి చెరుకువాడ రంగనాథ రాజు. రఘురామకృష్ణంరాజు 14 నెలలు నుండి ఢిల్లీలో కూర్చుని తనను గెలిపించిన ప్రజలను గాలికొదిలేశారని…కనీసం వారి బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదని నిప్పులు చెరిగారు. ఈ సమయంలో ఎంపీని అరెస్టు చేయడం సరికాదంటున్న ప్రతిపక్ష పార్టీలు తీరు సరికాదని…అసలు వారికి ఏంటి అతని మీద అంత ప్రత్యేక శ్రద్ధ అని చురకలు అంటించారు. పశ్చిమ గోదావరి జిల్లా అంటే ప్రశాంతంగా ఉన్న జిల్లా…