మానసిక ఆరోగ్యం సరిగా లేకపోతే రోజూవారి జీవితంపై ప్రభావం చూపిస్తుంది. జీవనశైలి సరిగా లేకపోవడం, ఒత్తిడి పెరగడం, అనారోగ్యకరమైన ఆహార ప్రణాళిక వంటి అంశాలు మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఇది మనం ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటాము, ఇతరులతో మంచి సంబంధాలు, నిర్ణయాలు తీసుకోవడం వంటి విషయాలను ప్రభావితం చేస్తుంది. మానసిక అనారోగ్యం అనేది ఆందోళన, నిరాశ, స్కిజోఫ్రీనియా, లేదా బైపోలార్ డిజార్డర్ వంటి పరిస్థితులను కలిగి ఉంటుంది. మానసిక అనారోగ్యానికి గురైతే నిరంతర ఆందోళన,…