Sonia Gandhi to travel abroad for medical check-ups: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లనున్నారు. సోనియా వెంట రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకా గాంధీ కూడా వెళ్లనున్నట్లు కాంగ్రెస్ పార్టీ మంగళవారం తెలిపింది. అయితే వారి పర్యటకు సంబంధించిన తేదీలను వెల్లడించలేదు. కాంగ్రెస్ అధ్యక్షురాలు వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లనున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.