కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని.. రోజుకు 3 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని వైద్యశాఖ ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతున్నందున.. మన రాష్ట్రానికి కూడా సరిపడా వ్యాక్సిన్ సరఫరా అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కరోనా పూర్తి నియంత్రణలోనే ఉన్నప్పటికీ, భవిష్యత్ లో ప్రజలకు కరోనా వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటానికి వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే ప్రభుత్వ,…