రేపు మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మేడారం జాతరను మరింత ఘనంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం జాతరను మరింత ఘనంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నడుంబిగించింది. ఇంతకాలం మేడారం జాతరకు ప్రభుత్వాలు తాత్కాలిక ఏర్పాట్లు చేసేవి. జాతర నిర్వహణపై సమీక్షకు సైతం గతంలో ముఖ్యమంత్రులు పెద్దగా శ్రద్ధ చూపేవారు కాదు. తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం జాతర ఏర్పాట్లపై…