తెలుగు సినిమాకు ఓ ప్రత్యేకమైన చెరగని ముద్ర వేసిన వారిలో బహుముఖ నట సమ్రాట్ మోహన్ బాబు ఒకరు. హీరోగా ఎంట్రీ ఇచ్చి, విలన్‌గా చెలరేగి, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెరిసి, మళ్లీ హీరోగా తిరిగి ప్రేక్షకులను అలరించిన ఇలాంటి సినీ ప్రయాణం ప్రపంచ సినిమా చరిత్రలో కూడా చాలా అరుదు. నటుడిగా, నిర్మాతగా, విద్యా సేవలలోనూ అడుగడుగునా కొత్త మైలురాళ్లు నెలకొల్పిన మోహన్ బాబు ఈ సంవత్సరం తన 50 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్నారు.…