మాస్ మహారాజా రవితేజ “క్రాక్”తో చాలా కాలం తరువాత హిట్ ను అందుకుని మళ్ళీ ట్రాక్ లోకి వచ్చారు. “రాజా ది గ్రేట్” తరువాత ఆయనకు వరుస ఫ్లాప్ లు ఎదురయ్యాయి. కానీ కరోనా ఉన్నప్పటికీ ఈ ఏడాది మొదట్లో “క్రాక్”తో ధైర్యంగా థియేటర్లలోకి వచ్చాడు. ఈ చిత్రం హిట్ రవితేజకు మంచి ఎనర్జి ఇచ్చిందనే చెప్పాలి. గతంలో “రాజా ది గ్రేట్”కు ముందు కూడా రవితేజ వరుస డిజాస్టర్లతో సతమతమయ్యారు. ప్రస్తుతం ఆయన యాక్షన్ థ్రిల్లర్…