స్మార్ట్‌ఫోన్లు వచ్చాక సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో విడదీయరాని భాగమైపోయింది. నిమిషం కూడా మొబైల్‌ను వదిలి ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఇష్టమైన ప్లాట్‌ఫార్మ్‌ను ఓపెన్ చేసి గంటల తరబడి రీల్స్, వీడియోలు స్క్రోల్ చేస్తూ లైక్‌లు, కామెంట్లు చేయడం సాధారణంగా మారింది. అయితే ఇదే అలవాటు టర్కీలోని ఒక వ్యక్తిని కోర్టు వరకూ తీసుకెళ్లింది. టర్కీకి చెందిన ఓ వ్యక్తి తన భార్య ముందే సోషల్ మీడియాలో ఇతర మహిళల ఫోటోలను చూసి లైక్‌లు చేశాడు.…