సహజంగా రాజకీయ నాయకులు పదవుల్లోకి వచ్చారంటే కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టుకుంటారు. లేదంటే బినామీల పేర్ల మీదనో.. లేదంటే బంధువుల పేర్ల మీదనో ఆస్తులు సంపాదిస్తుంటారు. ఎమ్మెల్యే అయితేనే కోట్లు వెనకేసుకుంటారు. అలాంటిది ముఖ్యమంత్రి స్థాయి అంటే ఇంకెంతగా సంపాదిస్తారో వేరే చెప్పనక్కర్లేదు. అలా అక్రమాస్తులు సంపాదించి జైలు పాలైన రాజకీయ నాయకులను ఎంతో మందిని చూశాం. తరతరాలు కూర్చుని తినేంతగా సంపాదించుకుంటారు. కానీ అందుకు భిన్నంగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.…