త్వరలోనే ఫిలిప్పిన్స్ దేశానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు స్టార్ బాక్సర్ మన్నీ పాక్వియానో సిద్ధం అవుతున్నారు. చాలా కాలంగా పాక్వియానో అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ ఊహాగానాలకు పాక్వియానో తెరదించాడు. ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. మన్నీ పాక్వియానో చిన్నతనంలో దుర్భరమైన జీవితాన్ని గడిపాడు. తిండికి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే, బాక్సింగ్ క్రీడను ఎంచుకున్నాక ఆయన జీవితం మారిపోయింది. అంచలంచెలుగా…